భాగ్యనగరంలో వర్షబీభత్సం.. నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్...
హైదరాబాద్ నగరంలో గత అర్థరాత్రి వర్షబీభత్సం సృష్టించింది. ఫలితంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే, రాత్రికి రాత్రే హుస్సేన్ సాగర్‌కు జలకళ వచ్చింది. ఇందులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీ
హైదరాబాద్ నగరంలో గత అర్థరాత్రి వర్షబీభత్సం సృష్టించింది. ఫలితంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే, రాత్రికి రాత్రే హుస్సేన్ సాగర్‌కు జలకళ వచ్చింది. ఇందులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం వరకూ నీరు లేక బోసిపోయిన హుస్సేన్ సాగర్, తెల్లారేసరికి నిండుకుండలా కనిపిస్తోంది.
ముఖ్యంగా.. నైరుతీ రతుపవనాల కారణంగా నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా, పంజాగుట్ట, ఉప్పల్, అంబర్ పేట రోడ్ నంబర్ 6, తాజ్ కృష్ణా జంక్షన్, అమీర్ పేట ఇమేజ్ ఆసుపత్రి, కేసీపీ జంక్షన్, బేగంపేట న్యూవే, నింబోలి అడ్డా, చింతల్ బస్తీ గోల్నాక, పుత్లీబౌలీ, సీబీఎస్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తున వర్షపు నీరు నిలిచివుంది
ఈ వర్ష బీభత్సం కారణంగా పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హుస్సేన్ సాగర్ కు దారితీసే నాలాలన్నీ పొంగి పొరలుతున్నాయి.