Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను నటుడిగా మారితే ఆయన రైతుగా మారారు.. రఘువీరాపై చిరు ప్రశంసలు

Advertiesment
నేను నటుడిగా మారితే ఆయన రైతుగా మారారు.. రఘువీరాపై చిరు ప్రశంసలు
, ఆదివారం, 20 జూన్ 2021 (08:54 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. తాను రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్లీ నటుడుగా మారితే, రఘువీరా రెడ్డి కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని రైతుగా మారారని గుర్తుచేశారు. 
 
అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో రఘువీరా నేతృత్వంలో కొత్తగా నిర్మిస్తున్న దేవాలయాలకు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రఘువీరాకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. తన రాజకీయ జీవితంలో గొప్ప స్నేహితుడు రఘువీరా అని చెప్పారు. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఆయనతో తనకు బలమైన అనుబంధం ఏర్పడిందని తెలిపారు.
 
కరువుసీమకు నీళ్లు ఇవ్వాలనే కథాంశంతో తాను 'ఇంద్ర' సినిమాను తీశానని... ఆ సినిమా ప్రేరణతోనే రఘువీరా కరువుసీమకు నీళ్లు ఇచ్చారని, ఇది ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనమని చిరంజీవి ప్రశంసించారు. 
 
రాయలసీమకు నీళ్లు ఇవ్వడం, ఆ కార్యక్రమానికి తాను హాజరుకావడం తన భాగ్యమని అన్నారు. తాను మళ్లీ సినిమాలు చేస్తూ నటుడిగా కొనసాగుతుంటే... రఘువీరా రైతుగా మారారని చెప్పారు. 
 
వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలను పునర్నిర్మిస్తున్నారని, కొత్త ఆలయాలను నిర్మిస్తున్నారని కొనియాడారు. రఘువీరాకు భగవంతుని ఆశీస్సులు, ప్రజల సహకారం ఎప్పుడూ ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూర్పుగోదావరి జిల్లా మినహా... ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలింపు