Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమిత్ షాతో రఘురామ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Advertiesment
అమిత్ షాతో రఘురామ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
, మంగళవారం, 20 జులై 2021 (20:47 IST)
ఏపీ సీఎం జ‌గ‌న్ ని టార్గెట్ చేస్తూ, విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్న ర‌ఘురామ ఢిల్లీ త‌న ఆఖ‌రి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. కేంద్రహోం మంత్రి అమిత్ షాతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా రఘురామ ఆరోగ్య పరిస్థితులపై అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.  నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆయన కీలక ఆరోపణలు చేశారు. దీంతో రఘురామపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో రఘురామ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది.

జగన్ బెయిల్ రద్దుకు మద్దుతివ్వాలని రఘురామ పలువురు ఎంపీలకు రఘురామ లేఖలు రాశారు. దీంతో రఘురామ వర్సెస్ వైసీపీగా మారింది. అటు రఘురామపై అనర్హత వేయాలని వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా... రఘురామకు లేఖ రాశారు. వైసీపీ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరారు. తాజాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు. ‘‘నాపై అనర్హత వేటు పడదు. మీ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుంది. వాట్సాప్‌లో చాటింగ్ బయట పెట్టామని అంటున్నారు.. నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు. పెగసెస్ సాఫ్ట్‌వేర్ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?’’ అని రఘురామ ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్రమంత్రి అమిషాను రఘురామ కలిశారు. పలు అంశాలపై చర్చిస్తున్నారు దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం చోటు చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్రలో ఈరోజు