Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కత్తితో సైకో వీరంగం...ఏడుగురిపై దాడి...కొట్టి చంపిన జనం

విశాఖపట్నంలో సైకో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న సైకో కత్తితో ఏడుగురిపై దాడి చేశాడు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సైకోను పట్టుకుని

Advertiesment
psycho
, శనివారం, 15 అక్టోబరు 2016 (13:15 IST)
విశాఖపట్నంలో సైకో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న సైకో కత్తితో ఏడుగురిపై దాడి చేశాడు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఆ వివరాలను పరిశీలిస్తే... విశాఖ నగరం కంచరపాలెంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 31 ఏళ్ల వయస్సున్న ఓ ఉన్మాది వూర్వశి జంక్షన్‌ నుంచి కంచరపాలెం మెట్టు వరకు ఏడుగురు వ్యక్తులను కత్తితో పొడిచి భయానక వాతావరణాన్ని సృష్టించాడు.
 
అతడు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో వివరాలు తెలీయదు. అతడిని చూసి స్థానికులు అరుపులు కేకలు వేయడంతో ఉన్మాది చెలరేగిపోయాడు. ఇంతలో అతడు మెట్టు వద్ద గల ఓ టీ దుకాణం నిర్వాహకుడిని కత్తితో పొడవడంతో అక్కడనున్న వారు వెంటనే పట్టుకుని సైకోని గొడ్డును బాధినట్టుబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అతడు రక్తపు మడుగులో ఉండడం చూసిన పోలీసులు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లి పోయారు. 
 
అప్పటికే సైకో శరీరమంతా గాయాలతో రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సైకో మృతి చెందాడు. ఉన్నాది దాడిలో  తీవ్రంగా గాయపడిన బాధితుల్లో నలుగురు కేజీహెచ్‌కు తరలించగా, ముగ్గురు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైకో వీరవిహారం చేసిన ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు మెట్టు వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడుకు కొత్త గవర్నర్‌.. పరిశీలనలో మోత్కుపల్లి నర్సింహులు పేరు?