Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, ఓడ రేవుల నిర్మాణం, పవర్ సెక్టార్లకు నిధులు అందించండి: ఆదిత్యనాథ్ దాస్

రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, ఓడ రేవుల నిర్మాణం, పవర్ సెక్టార్లకు నిధులు అందించండి: ఆదిత్యనాథ్ దాస్
, మంగళవారం, 16 మార్చి 2021 (12:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, పవర్ సెక్టార్ రంగాలు ఓడరేవుల అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆ దిశగా నిధులు సమీకరణకు బ్యాంకర్ల సహకారం అవసరమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు.  మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం కోసం బోధన ఆసుపత్రులతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగం కొత్త వైద్య కళాశాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా మెడికల్ కాలేజ్ లకు రుణాలు విస్తరించడానికి బ్యాంకులతో సమన్వయం చేసుకొనేందుకు ఇది కృషి చేస్తుందన్నారు.

ఆరోగ్య రంగానికి 2 వేల కోట్ల రూపాయలు రుణ సదుపాయం అవసరం కాగలదని పెద్ద మనస్సుతో ఇందుకు సహకరించాలని యూబిఐ ఎండి రాజ్ కిరణ్ రాయ్ ను సిఎస్ కోరారు. అదేవిధంగా 2023 నాటికి రాష్ట్రంలో 3 ఫంక్షనల్ గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడులో గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్దికి నిధులు సమీకరణ చేపట్టడం జరిగిందన్నారు.

ఇందుకు అవసరమైన రుణ సదుపాయం కల్పించే విషయంలో కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పవర్ సెక్టార్ రంగంలో కూడా చేపట్టిన కార్యక్రమాలకు రుణ సదుపాయం కల్పించాలని ఆయన కోరారు. కోవిడ్ సమయంలో కూడా నిధులు కొరత లేకుండా చూసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిజెపి సహకరించనందునే ఓడిపోయాం: జనసేన