Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ సూచన మేరకే దళితుడిని అభ్యర్థిగా మోడీ ప్రకటించారా? కేసీఆర్‌కే తొలి ఫోనెందుకు?

ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా న్యాయకోవిదుడైన దళితనేత ప్రస్తుతం బీహార్ గవర్నరుగా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించా

కేసీఆర్ సూచన మేరకే దళితుడిని అభ్యర్థిగా మోడీ ప్రకటించారా? కేసీఆర్‌కే తొలి ఫోనెందుకు?
, మంగళవారం, 20 జూన్ 2017 (14:27 IST)
ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా న్యాయకోవిదుడైన దళితనేత ప్రస్తుతం బీహార్ గవర్నరుగా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని అమిత్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ తొలుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేశారు. "కేసీఆర్‌జీ.. మీరు చెప్పారుగా..! రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడిని ఎంపిక చేయాలని. మీ సూచన మేరకే ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం" అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 
 
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను ప్రకటించిన మరుక్షణమే ఆయన సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఫోన్ చేసిన వెంటనే ఆగమేఘాల మీద తెరాస పార్టీ నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంప్రదించారు. అనంతరం కోవింద్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించారు. కోవింద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎంపిక చేసిన మరుక్షణమే ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారని వెంకయ్య తెలిపారు. దాంతో, సంపూర్ణ సహకారం అందిస్తామని, కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారని చెప్పారు. తాము ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కేసీఆర్‌కు వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరదలే కదా అని ఓవరాక్షన్ చేశాడు.. నడివీధిలో చితకబాదింది..