Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీ వచ్చి.. రాజా.. నిన్ను రాజ్యసభకు పంపిస్తానని చెప్పినా.. జగన్‌కే ప్రచారం చేస్తా: పోసానీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన వద్దకు వచ్చి.. నాయనా.. రాజా.. పోసానీ.. నువ్వు బీజేపీ తరపున ప్రచారం చేస్తే నిన్ను రాజ్యసభకు పంపిస్తానని చెప్పినా.. తాను మాత్రం వైకాపా చీఫ్ జగన్‌కి ప్రచారం చేస్తానన

Advertiesment
మోదీ వచ్చి.. రాజా.. నిన్ను రాజ్యసభకు పంపిస్తానని చెప్పినా.. జగన్‌కే ప్రచారం చేస్తా: పోసానీ
, శనివారం, 29 జులై 2017 (20:00 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన వద్దకు వచ్చి.. నాయనా.. రాజా.. పోసానీ.. నువ్వు బీజేపీ తరపున ప్రచారం చేస్తే నిన్ను రాజ్యసభకు పంపిస్తానని చెప్పినా.. తాను మాత్రం వైకాపా చీఫ్ జగన్‌కి ప్రచారం చేస్తానని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు.

తనను ఎవరు ప్రలోభపెట్టినా.. ఏం చేసినా, డబ్బు, పదవి ఏమిస్తానన్నా.. తన ఓటు మాత్రం వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికేనని... జగన్‌కే ప్రచారం చేస్తానని చెప్పారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరుగుండదని, తన వ్యక్తిత్వమే అలాంటిదని పోసాని తెలిపాడు. పదవి ఇస్తానని జగన్ ఆఫర్ చేసినా తనకు అక్కర్లేదని స్పష్టం చేశాడు. జగన్ పోటీ చేయమన్నా చేయనని పోసాని స్పష్టం చేశాడు. 
 
ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేయాలని చిరంజీవి అడిగినట్టు పవన్ కల్యాణ్ అడిగితే ఏం చేస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పోసాని సమాధానమిచ్చాడు. తన మాటకు తిరుగులేదని.. మాట మారుస్తాననే డౌట్ వుంటే.. తన మాటలు రికార్డు చేసి పెట్టుకోవాలని సూచించాడు. ఎవరేమీ చెప్పినా జగన్‌కే తన సపోర్ట్ అంటూ పోసాని వ్యాఖ్యానించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైంగిక వేధింపులే అలవాటు.. వాకింగ్‌కు వెళ్లే మహిళలే టార్గెట్..