Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ - హాజరు కానున్న నరేంద్ర మోదీ

తిరుపతిలో జరుగనున్న ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌-104ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడానికి తితిదేతో పాటు ఎస్వీయు

Advertiesment
PM Narendra Modi will attend to Science congress in Tirupati
, సోమవారం, 2 జనవరి 2017 (20:10 IST)
తిరుపతిలో జరుగనున్న ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌-104ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడానికి తితిదేతో పాటు ఎస్వీయు అధికారులు మల్లగుల్లాలు పడి పూర్తి చేశారు. సైన్స్ కాంగ్రెస్‌ నిర్వహణను ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఈఓ ప్రత్యేక శ్రద్థ తీసుకుని సైన్స్ కాంగ్రెస్‌కు తితిదే వైపు నుంచి చేయాల్సిన పనులపై దృష్టి సారించారు.
 
సైన్స్ కాంగ్రెస్‌ ప్రతినిధుల కోసం తితిదే ఆధ్వర్యంలోని డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు కలిపి మొత్తం ఏడు చోట్ల బస ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన గదుల్లో గజర్లతో పాటు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రాంతాల వారీగా ఇన్‌ ఛార్జులను నియమించి ఇస్కా ప్రత్యేక బృందాల అధికారులతో సమన్వయం, ఈఓ చేసుకోవాలని ఆదేశించారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఎల్‌ఇడి దీపాలను ఏర్పాటు చేశారు. హిందూదర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సదస్సు జరిగే ప్రధాన వేదిక వద్ద తితిదే ఆధ్మాత్మిక ప్రచురణల విక్రయశాల, డైరీలు, క్యాలెండర్లు, 300రూపాయల ప్రత్యేక ప్రవేశదర్సన టిక్కెట్‌ కౌంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ తగినన్ని స్పైపింగ్‌ యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఈఓ ఆదేశించారు.
 
 సైన్స్ కాంగ్రెస్‌ సభలకు దేశ వ్యాప్తంగా 12వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. నోబుల్‌ బహుమతి గ్రహీతలతో పాటు అనేకమంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలు రానున్నారు. వీరందరికీ ప్రత్యేక ప్రణాళికలతో దర్సన ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 3,4,5 తేదీల్లో ప్రతినిధుల హోదాను బట్టి శ్రీవారి దర్సనం కల్పించనున్నారు. సభలు 7వతేదీదాకా జరుగుతాయి. సభలు ముగిసేలోపే అందరూ దశల వారగా దర్సనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సభలు ముగిసిన మరునాడే అంటే 8వతేదీ వైకుంఠ ఏకాదశి, 9న ద్వాదశి పర్వదినాలు ఉన్నాయి. 
 
ఈ రోజుల్లో ప్రత్యేక దర్సనాలు సాధ్యం కావు. అందుకే సైన్స్ సభల ప్రతినిధులు 7వతేదీ లోపు దర్సనాలు చేసుకోవాల్సి ఉంటుంది. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వివిధ స్లాట్‌లలో దర్సనం చేయించడానికి సిద్థంగా ఉన్నట్లు తితిదే ఉన్నతాధికారులు చెబుతున్నారు. సైన్స్ కాంగ్రెస్‌ సభల కంటే ముందే జనవరి రావడం, వెంటనే వైకుంఠ ఏకాదశి ఉండడంతో తిరుమల, తిరుపతిలలో కనువిందు చేసే విద్యుత్‌ దీపాలంకరణలు చేశారు.
 
ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చేవారికి తిరుమల పర్యటన ఎప్పటికీ గుర్తిండిపోయే స్థాయిలో తితిదే ఏర్పాట్లు చేస్తోంది. తితిదే అధికారులంతా కొన్ని రోజులుగా ఇదే పనిలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ సీఎం పోస్టుకు అడ్డుపడుతున్న తమిళ 'సూరీడు'... 2017 స్టాలిన్‌దేనా?