గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమైన ఘటనలో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. మొదట్లో 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు సమాచారం అందడంతో అధికారులు రూ.1.68 కోట్ల జరిమానా విధించారు. తదుపరి పరిశోధనల్లో అదనపు బియ్యం బస్తాలు మాయమైనట్లు తేలడంతో మొత్తం కొరత 378 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.
ఇకపోతే..వైసీపీ నేత పేర్ని నాని వ్యవహారంపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం మాయమైంది నిజం. డబ్బులు కట్టింది వాస్తవం. డబ్బులు కట్టేశాం అంటే ఎలా? కుదురుతుందని ప్రశ్నించారు. తప్పు జరిగింది కాబట్టే కేసు పెట్టారు.
ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోడౌన్ పెట్టింది ఎవరు..? చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను మీరు తిట్టలేదా? మేము ఆడవాళ్లను కేసులో ఇరికించలేదే. ఆయన చేసిన తప్పుకు వాళ్ల ఇంట్లోవాళ్లను వీధిలోకి తెచ్చారు అంటూ పవన్ అన్నారు.