Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతుల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం అయినా కూలిపోవాల్సిందే : పవన్ కళ్యాణ్

రైతుల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం అయినా కూలిపోవాల్సిందే : పవన్ కళ్యాణ్
, ఆదివారం, 8 డిశెంబరు 2019 (14:47 IST)
రైతుల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం అయినా కూలిపోవాల్సిందేనంటూ జనసేన పార్టీ అధినే పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వెలగతోడులో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేందంటూ విమర్శలు గుప్పించారు. నేతలు ఓట్ల కోసం పాదయాత్రలు చేస్తున్నారని, రైతుల కన్నీళ్లు తుడవడానికి ఇప్పుడు పాదయాత్రలు అవసరమన్నారు. ఏపీ సీఎం జగన్ ఇప్పుడు ప్రజల్లో తిరగాలని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో కూడిన రక్తం కూడు తింటున్నారని ఆయన అన్నారు.
 
రైతులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని పవన్ ప్రకటించారు. రైతుల ఆవేదన తనకు తెలుసని, లోతుగా విశ్లేషణ చేసి రైతు సమస్యలు తీర్చేందుకు ప్రణాళికలు వేస్తామన్నారు. తనకు నిజాలు చెబితే విజిలెన్స్ దాడులు చేయిస్తామని రైస్ మిల్లర్లను వైసీపీ నేతలు బెదిరించారని, జిల్లాలో తన పర్యటన ఖరారు కావడంతో ప్రభుత్వం భయపడుతోందన్నారు. 
 
అంతేకాకుండా, రైతుల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం అయినా కాలిపోవాల్సిందేనని, రైతులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, రైతులకు అండగా ఉండడానికి జనసేన పార్టీ వస్తోందన్నారు. రాత్రికి రాత్రి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.87 కోట్లను విడుదల చేశారని గుర్తుచేశారు. అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం అవుతుందని చెప్పారు.
 
గతంలో పండించిన పంటకు ధర రావడం లేదని క్రాప్ హాలిడే పెట్టారని, అప్పటి నుండి ఇప్పటి వరకు రైతులకు కన్నీరే మిగిలింది తప్ప చెప్పినవి ఏమి అమలులోకి రాలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. రైతులకు లాభ సాటి ధర వచ్చేల ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
 
ఈ సందర్భంగా ఓ రైతు అక్కడకు వచ్చి కొబ్బరి బోండాన్ని అందించారు. ఆ కొబ్బరి నీళ్లు తాగాలని సూచించారు. అయితే, ఆ కొబ్బరి బోండాన్ని తీసుకున్న పవన్ తిరిగి దాన్ని ఇచ్చేశారు. రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో అప్పుడే కొబ్బరి నీళ్లు తాగుతానని ఆయన చెప్పారు. రైతులను సమస్యలను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమవుతోందని పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలోని జంతువులకు అన్ని సదుపాయాలు దగ్గరకే వస్తాయి : నాగబాబు