Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఏంటో తెలుసా?

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం తథ్యమని తేలిపోయింది. అనంతపురం జిల్లా నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే, ఈ జిల్లాలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్

పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఏంటో తెలుసా?
, బుధవారం, 17 మే 2017 (16:19 IST)
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం తథ్యమని తేలిపోయింది. అనంతపురం జిల్లా నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే, ఈ జిల్లాలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న సందేహం ఇప్పటివరకు నెలకొనివుంది. దీనిపై పలువురు పలు రకాలుగా ఊహించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా.. పవన్ పోటీ చేసే స్థానంపై ఆయన అభిమానుల్లో, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో... పవన్ కళ్యాణ్ కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేత ఒకరు చెబుతున్నారు. అయితే, గుంతకల్లు నియోజకవర్గంపైనా పవన్ దృష్టి ఉందని మరికొందరు అంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పవన్ అభిమానుల సంఖ్య విపరీతంగా ఉండటంతో, ఆయా నియోజకవర్గాలపైనే జనసేనాని దృష్టి పెట్టినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళను సీక్రెట్‌గా వీడియో తీశాడు.. ఆమె ఏం చేసిందో తెలుసా? (video)