Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభం .. ఈ దీక్ష ఎందుకోసం చేస్తారు?

pawan kalyan

వరుణ్

, మంగళవారం, 25 జూన్ 2024 (13:16 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను మంగళవారం నుంచి ప్రారంభించారు. మొత్తం 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షా కాలంలో ఆయన కేవలం పాలు, పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ దీక్షను చేస్తున్నారని తెలియగానే ఈ దీక్ష చర్చనీయాంశంగా మారింది. అసలింతకీ ఈ వారాహి అమ్మవారి దీక్షను ఎందుకు చేస్తారన్నదానిపై ఇపుడు విస్తృతంగా చర్చ సాగుతుంది. 
 
మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభు.. వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారు అంటుంటారు. అమ్మవారి రూపం వరాహం ముఖంతో ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖు చక్రాలు.. వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింహం.. వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్టు పురాణాల్లో తెలిపారు.
 
వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఆ దేవత గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి తక్కువమందికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవిని చెపట్టిన‌ అనంతరం  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నారు. వారాహి అమ్మవారిని ఆరాధించటానికి ప్రత్యేక కారణాలు ఉంటాయి.
 
శత్రుభయం ఉండకూడదనే కారణంతో వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవటానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు అంటే కామ క్రోధ మద మోహ మాత్సర్యాల నుండి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవటానికి అమ్మవారి దీక్ష కూడా చేపడతారు.‌ వారాహి అమ్మవారి దీక్ష జేష్ఠ్య మాసం ఆఖరులో ఆషాడ మాసం ఆరంభంలో చేపడతారు. 
 
అన్ని దీక్షల్లాగే సాత్వికాహారం తీసుకొని, రెండు పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో,  నేలపై పడుకుంటూ, అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్ష చేస్తారు. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలా తొమ్మిది రోజులు చేస్తారు. కొంతమంది 11 రోజులు రోజులు చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తమ పాలనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని అమ్మవారి దీక్ష చేపట్టినట్లు తెలుస్తొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంజాయి మత్తులో బాలికపై ఐదుగురు కామాంధుల అఘాయిత్యం!