Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ సభలో అభిమాని హల్‌చల్ (వీడియో)

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన తొలిదశ తెలంగాణ యాత్రను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, ఆయన అనంతపురం పర్యటనకు వెళ్లారు.

పవన్ కళ్యాణ్ సభలో అభిమాని హల్‌చల్ (వీడియో)
, శనివారం, 27 జనవరి 2018 (13:57 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన తొలిదశ తెలంగాణ యాత్రను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, ఆయన అనంతపురం పర్యటనకు వెళ్లారు. అక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పవన్‌ కల్యాణ్ ఎక్కడికెళ్లినా అభిమానులు వెల్లువలా తరలివస్తున్నారు. అనంతలో కూడా ఇదే మాదిరిగా ఫ్యాన్స్ పవన్ సభకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా పవన్‌ను కలవడం కోసం ఓ అభిమాని చేసిన ప్రయత్నంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. డయాస్ వద్దకు తోసుకు వస్తున్న అభిమానులను కట్టడి చేస్తున్న పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని వేదికపైకి వచ్చాడు. వెంటనే పవన్‌ను గట్టిగా హత్తుకున్నాడు. పవన్ కూడా అతన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో పోలీసులు షాకయ్యారు. 
 
అతనిని పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆ అభిమాని ఒప్పుకోలేదు. పవన్‌తో సెల్ఫీ దిగడానికి ఉత్సాహం చూపాడు. అతని అభిమానానికి ఫిదా అయిన పవన్.. అతనిచ్చిన సెల్‌ఫోన్ తీసుకుని సెల్ఫీ దిగాడు. దీంతో అక్కడ నుంచి ఆ యువకుడు వెళ్లిపోయాడు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ పెళ్లా... ఎక్కువ రోజులు ఉండదు.. విడాకులు తీసుకోండి : హైకోర్టు