పెద్దలు అయ్యన్నపాత్రుడు గారు.. నేను మాట్లాడాలా? మరి మీరేం చేస్తారు? పవన్ సెటైర్లు
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం జనసేనాని పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడవచ్చు కదా అంటూ ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించిన నేపథ్యంలో.. పవన్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. చేతనైతే మోడ
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం జనసేనాని పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడవచ్చు కదా అంటూ ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించిన నేపథ్యంలో.. పవన్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. చేతనైతే మోడీ దగ్గరకు వెళ్లి మాట్లాడి ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకురావాలని మంత్రి అయ్యన్నపాత్రుడు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు.
"పెద్దలు అయ్యన్నపాత్రుడు గారు... నేను మోడీ గారితో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. నేను వారికి చెప్పేదేమిటంటే, నేను మోడీగారితో ప్రచార సభల్లోనే పాల్గొన్నాను. కానీ మీ ఎంపీలు అందరూ పార్లమెంట్‌లో ఆయనతో కూర్చుంటున్నారు కదా?.. మరి వారేం చేస్తున్నారు? మీడియా ముందుకు వచ్చి కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వదని చెప్పడం తప్ప. అసలు ఇస్తారో ఇవ్వరో తరువాత సంగతి. ప్రజల అసంతృప్తిని కేంద్రానికి చెప్పడానికి కూడా మీరు భయపడితే ఎలా..?" అని తనదైన శైలిలో పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మరోవైపు ప్రత్యేక హోదాపై పవన్ ఘాటుగా స్పందించారు. ప్రత్యేక హోదా కోసం దీక్షకు దిగుతామని ప్రకటించిన ఆంధ్ర యువతకు మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఏపీ ప్రత్యేక హోదాను కోరుకుంటోందంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆంధ్రుల అభిలాషను తెలిపారు. ‘ఆంధ్రులు.. ఈ దేశ ప్రజలు.. కేంద్రంలో ఉండే నాయకులకి, పార్టీలకి బానిసలు కాదు’ అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఏకవాక్యంగా చేసిన ఈ విమర్శలపై నెటిజన్లు సైతం మద్దతు పలుకుతున్నారు.
పవన్ చేసిన ఈ పోస్టుకు ఇప్పటికే వేల సంఖ్యలో రీట్వీట్లను తెచ్చుకుంది. కాగా, నాయకులు పని చేయక పోవడం వల్లే యువత రోడ్లపైకి వస్తోందని, మీరు ఏమీ చేయక, యువతను చేయనీయక పోతే సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.