వైకాపాపై కోపం లేదు.. హోదా సరే.. ప్యాకేజీ అర్థరాత్రి ఎందుకు ప్రకటించారు: పవన్ ప్రశ్న
ప్రత్యేక హోదా ట్వీట్లు చేస్తే సరిపోదని.. ప్యాకేజీపై, హోదాపై అన్నీ తెలుసుకుని మాట్లాడాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జనసేనాని పవన్‌పై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ హైదరాబాదులోని పార్టీ కార్యాలయ
ప్రత్యేక హోదా ట్వీట్లు చేస్తే సరిపోదని.. ప్యాకేజీపై, హోదాపై అన్నీ తెలుసుకుని మాట్లాడాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జనసేనాని పవన్‌పై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియా మాట్లాడుతూ స్పందించారు. వెంకయ్యకు కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాది-దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేయొద్దన్నారు. మతాల ఆధారంగా విభజిస్తే పర్లేదు కానీ.. తాను దక్షిణాది-ఉత్తరాది అని మాట్లాడితే తప్పవుతుందా? అంటూ ప్రశ్నించారు.
ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయని, తెలివితేటలు కేవలం నార్త్ బ్లాక్‌లో ఉన్నవారికే పరిమితం కాదని పవన్ సెటైర్లు విసిరారు. తాను కనీసం ట్విట్టర్లోనైనా హోదా కోసం మాట్లాడుతున్నానని, ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. పార్లమెంట్‌లో బీజేపీ ఇచ్చిన మాట తప్పిందని పవన్ ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరే, ప్యాకేజీ అర్ధరాత్రి ఎందుకు ప్రకటించారో చెప్పాలని అడిగారు.
నాడు ఇందిరాగాంధీ ఓ సంఘటనకు సంబంధించి వచ్చి క్షమాపణ చెప్పి వెళ్లిపోయారని పవన్ గుర్తు చేశారు. అందుకే నేతలు హామీలు నెరవేర్చకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ అన్నారు. చట్టసభల్లో నేతల ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇక వైకాపా అయినా.. ఏ పార్టీతో తనకు వ్యక్తిగత కోపం లేదని.. సీపీఐ రామకృష్ణ గారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని చెప్పారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని పవన్ పిలుపు నిచ్చారు. వ్యక్తిగతంగా తనకు లీడ్ చేసే అనుభవం లేదన్నారు.