Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖలో కొణతాల రామకృష్ణ ఇంటిలో పవన్ కళ్యాణ్ సందడి...

konatala - pawan

వరుణ్

, సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (08:46 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విశాఖపట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల తమ పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లి సందడి చేశారు. తన ఇంటికి వచ్చిన పవన్‌కు కొణతాల సాదర స్వాగతం పలికారు. అయితే, కొణతాల - పవన్ కళ్యాణ్‌ల మధ్య జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని జనసేన పార్టీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. 
 
ఉత్తరాంధ్రలో ఎంతో కీలకమైన నేతగా చెలామణి అయిన కొణతాల రామకృష్ణ గతంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే, వైఎస్ఆర్ మరణం, రాష్ట్ర విభజన నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఆయన జనసేన పార్టీలో చేరారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. కొణతాల అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు రాగా, తాజాగా అనకాపల్లి ఎంపీగా సినీ నటుడు నాగబాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. దీనిపై జనసేన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సివుంది. 
 
వజ్రపు తునకలా మెరిసిపోతున్న భూమి... ఎలా? 
 
అగ్రరాజ్యం అమెరికా చంద్రమండలంపైకి తొలి ప్రైవేట్ ల్యాండ్ర నోవా-సిని పంపించింది. ప్రస్తుతం ఇది మార్గమధ్యలో ఉంది. ఈ నెల 15వ తేదీన కేప్ కానవెరాల్‌లోని కెన్నడీ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్సలు ఈ ల్యాండర్‌ను అంతరిక్షంలోకి చేర్చాయి. అటు ల్యాండర్ చంద్రుడిపై దూసుకెళుతుంది. ఈ ప్రయాణంలో ఈ ల్యాండర్ తీసి పంపిన ఫోటోలను అమెరికా కంపెనీ ఇనిషియేటివ్ మెషిన్ (ఐఎం) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భూమి వజ్రపు తునకలా మెరిసిపోతూ కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందనేది గతంలో చాలా ఫొటోలు చూసినా నోవా-సి పంపిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. కాగా, నోవా-సి ల్యాండర్ ఈ నెల 22న చంద్రుడిపై దిగనుంది. 
 
అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుడిపై దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్‌గా నోవా-సి, తొలి కంపెనీగా ఇనిషియేటివ్ మెషిన్స్ చరిత్ర సృష్టిస్తాయి. అంతేకాదు, 1972 తర్వాత చంద్రుడిపైకి అమెరికా పంపిన తొలి ల్యాండర్‌‍గా ఇది రికార్డులకెక్కనుంది. చంద్రుడిపైకి మరోసారి మానవ సహిత వ్యోమనౌకలను పంపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆర్టెమిస్ మూన్ ప్రోగ్రామ్‌‍ను చేపట్టింది. ప్రస్తుతం పంపించిన నోవా- సి ల్యాండర్ ఈ ప్రాజెక్టులో తొలి అడుగు అని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రైస్తవ మతసంప్రదాయంలో వైఎస్.షర్మిల కుమారుడి వివాహం