Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ తీరుపై పవన్ కళ్యాణ్ ఫైర్: అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు..

Advertiesment
ఏపీ తీరుపై పవన్ కళ్యాణ్ ఫైర్: అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు..
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (14:56 IST)
‘వైసీపీ ప్రభుత్వం రోడ్లను బాగు చేయడం లేదు.. అలాగే సొంతంగా రోడ్లను బాగు చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తిని వేధిస్తున్నారని’ అర్థం వచ్చేలా.. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు.. అంటూ పవర్ స్టార్ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ హైదర్షాకోట్ దగ్గర ఉండే కాట్నం బాలగంగాధర్‌ తిలక్‌ ప్రమాదాల నివారణ కోసం రోడ్లను బాగు చేసే పని స్వచ్ఛందంగా మొదలుపెట్టారు. 
 
ఈ క్రమంలోనే ఈయన దేశంలోని చాలా చోట్ల తన సొంత డబ్బుతో ఇప్పటి వరకు 2100 గుంతలను పూడ్చాడు. అందుకే ఈయనను రోడ్‌ డాక్టర్‌గా పిలుచుకుంటారు. అయితే బాలగంగాధర్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోనూ రహదారి గుంతలను పూడ్చేందుకు వెళ్లాడు. ఈ సమయంలోనే అక్కడి పోలీసులు తనపై కేసులు పెడతామంటూ వేధిస్తున్నారని ఆయన తాజాగా ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏపీ సర్కారుపై మండిపడ్డారు. 
 
రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, కడప జిల్లాలోనే రోడ్ల పరిస్థతి దారుణంగా మారిందని గత కొన్ని రోజులుగా తన వాదన వినిపిస్తూ వస్తోన్న పవన్‌ కళ్యాణ్‌ తాజాగా మరోసారి ట్విట్టర్‌ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ‘అమ్మపెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అంటూ వైసీపీ తనదైన శైలీలో ధ్వజమెత్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరసరావుపేటలో144 సెక్షన్...టెన్ష‌న్...టెన్ష‌న్!