Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరే అలాగే కానివ్వండి... పందులతో పందేలా... సుజనా చౌదరీ వ్యాఖ్యలపై పవన్ తాజా ట్వీట్

ప్రత్యేక హోదా కోసం యువత చేస్తున్న పోరాటంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు నుంచి స్ఫూర్తి పొందితే పందుల పందేలు పెట్టుకుని ఆడుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య

సరే అలాగే కానివ్వండి... పందులతో పందేలా... సుజనా చౌదరీ వ్యాఖ్యలపై పవన్ తాజా ట్వీట్
, గురువారం, 26 జనవరి 2017 (16:04 IST)
ప్రత్యేక హోదా కోసం యువత చేస్తున్న పోరాటంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు నుంచి స్ఫూర్తి పొందితే పందుల పందేలు పెట్టుకుని ఆడుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ యువత భగ్గుమంది. జనసేన అధినేత పవన్ కూడా కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ట్వీట్ల ద్వారా స్పందించారు. ఇంక మీరు నోరు జారే కొద్దీ యువతను రెచ్చగొట్టినట్టేనని పవన్ ట్వీట్ చేశారు. సరే అలాగే కానివ్వండి అంటూ హెచ్చరించారు.
 
ఆంధ్రలోని ప్రతి యువకుడు, యువతి.. మనల్ని వెటకారం చేసే గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి నాయకుడి దాకా ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకోవాలని పవన్ ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో వారందరికీ బుద్ధి చెప్పాలన్నదే పవన్ పరోక్ష సందేశంగా యువత భావిస్తోంది. 
 
''ప్రత్యేక హోదా కోసం పోరాట పటిమ చూపిన తెలుగు ప్రజలకు, ముఖ్యంగా యువతకు నా జేజేలు. నిన్న, ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్తలతో సహా ప్రతీ ఒక్కరినీ పోలీసులు బేషరతుగా తక్షణం విడుదల చేయాలి... జైహింద్'' అంటూ పవన్ తన ట్వీట్‌ను ముగించారు.
 
నిజానికి జల్లికట్టు కోసం తమిళ యువత చేసిన ఆందోళనను స్ఫూస్పూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగే ఆందోళనలో పాల్గొనాలని ఏపీ యువత పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు నుంచి స్ఫూర్తి పొందడం అంటే పందులతో పందేలు ఆడుకోండంటూ వ్యాఖ్యానించారు. యువత పోరాట స్ఫూర్తిని సుజనా చౌదరి గారు పందుల పందాలతో పోల్చడం బాధాకరమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడి ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట..!