Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో అంధ యువతి హత్య... పవన్ ఫైర్

pawan kalyan
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (13:10 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఒక అంధ యువతిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిత్యం పోలీసు పహారాలో ఉండే సీఎం నివాసానికి సమీపంలోనే ఇంత దారుణం జరిగితే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
ఈ హత్య ఘటనను శాంతిభద్రత వైఫల్యంగా చూడాలన్నారు. ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లో పటిష్టమైన పోలీసుల పహారా, నిఘా వ్యవస్థలు పని చేస్తున్నా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు, గంజాయికీ అడ్డాగా మారిందన్నారు. అంటే లోపం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. యేడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒకర్నీ ఇప్పటికీ అరెస్టు చేయలేక పోయారంటే వైఫల్యం ఎవరిది అని ప్రశ్నించారు. 
 
తన నివాసం పరిసరాల్లో పరిస్థితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒక్కటేనని, పోలీసు శాఖకు అవార్డు వచ్చాయి. దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 
 
యధేచ్చగా అత్యాచారాలు రాష్ట్రంలో జరుగుతంటే తల్లి పెంపకంలోనే లోపం ఉందని, ఏదో దొంగతనానికి వచ్చి రేప్ చేశారు అంటూ వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వం ఇదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆడపడుచులపై అఘాయిత్యాలు సాగుతున్నా మహిళా కమిషన్ ఏం చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన వైఎస్.జగన్మోహన్ రెడ్డి