Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

Advertiesment
Pawan kalyan

ఠాగూర్

, బుధవారం, 26 మార్చి 2025 (14:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గ పీఠాపురం ప్రాంతంలో రోడ్ ఓవర్ వంతెన నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.59.70 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు లభించాయి. దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ స్పందిస్తూ, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో తాను ఈ రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 
 
ఉప్పాడ - సామర్లకోట రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ చెప్పారు. ఈ వంతెన పూర్తయితే వాహన రాకపోకలు సులంభతరం అవుతాయని, ప్రజల ప్రయాణం సమయం సులభతరం అవుతుందని అన్నారు. 
 
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి సేతు బంధన్ పథకంలో భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిధులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారని చెప్పారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తికావాలని ఆశిస్తున్నారని తెలిపారు. 
 
ఏప్రిల్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు!! 
 
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల అయిన ఏప్రిల్ నెలలో భారీగా సెలవులు రానున్నాయి. మార్చి నెల ముంగింపునకు చేరుకుంది. ఏప్రిల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి నెల మాదిరిగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులు జాబితాను వెల్లడించింది. 
 
ఏప్రిల్ నెలలో మొత్తం 13 రోజులు సెలవులు రానున్నాయి. వివిధ పండుగలు, రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు కలిసి ఈ సెలవులు జాబితాలో ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఏప్రిల్ నెలలో వచ్చే సెలవుల వివరాలను పరిశీలిస్తే, 
 
ఏప్రిల్ 6 : ఆదివారం - శ్రీరామ నవమి 
ఏప్రిల్ 10 : గురువారం - జైనమత 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ జయంతి
ఏప్రిల్ 12 : రెండో శనివారం
ఏప్రిల్ 13 : ఆదివారం 
ఏప్రిల్ 14, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి 
ఏప్రిల్ 15 : బోహాగ్ బిహు పండుగ సందర్భంగా అగర్తల, గౌహతి, ఇటా నగర్, కోల్‌కతా, సిమ్లాలో బ్యాంకులకు సెలవులు
ఏప్రిల్ 16 : బోహాగ్ బిహు సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 20 : ఆదివారం 
ఏప్రిల్ 21 : గురియా పూజా సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 26 : నాలుగో శనివారం 
ఏప్రిల్ 27 : ఆదివారం 
ఏప్రిల్ 29 : పరుశురామ జయంతి 
ఏప్రిల్ 30 : బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా బెంగుళూరులో బ్యాంకులకు సెలవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Telangana: రూ.6లక్షల అప్పుల బాధ.. యాసిడ్ తాగిన చేనేత కార్మికుడు