Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గిరిజన బిడ్డలకు చెప్పులు పంపిన పవన్ కళ్యాణ్ సారు!!

Advertiesment
traibal womens

ఠాగూర్

, శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (08:51 IST)
వారంతా అడవిబిడ్డలు. ఏమాత్రం కపటం కల్మషం లేని గిరిజనులు. అలాంటి వారికి ఆదుకోవాలని సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నడుంబిగించారు. దీంతో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా, అనేక మన్యం గ్రామాలకు ఆయన రహదారులు వేయిస్తూ, కరెంట్ వచ్చేలా చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తాజాగా కొందరు గిరిజన మహిళలకు చెప్పులు పంపించి మరోమారు తన ప్రేమను చూటుకున్నారు. 
 
అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడుకు చెందిన కొందరు గిరిజన మహిళలు పవన్ కళ్యాణ్ పంపిన చెప్పులు వేసుకుని మురిసిపోతున్నారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపండంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన ఆదివాసీ గ్రామం పెదపాడులో పవన్ పర్యటించారు. ఆ సమయంలో పాంగిమిత్తు అనే వృద్ధురాలు నడిచి వచ్చి పవన్‌కు స్వాగతం పిలాకరు. ఆమె చెప్పులు లేకుండా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో పవన్ చలించిపోయారు. 
 
వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి, గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీయించి, వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. గురువారం ఆయన కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపారు. డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయ సిబ్బంది బోయిన్‌పల్లి పవ్‌తో పాటు బృంద సభ్యులు, స్థానిక సర్పంచి వెంకటరావు గురువారం ప్రతి ఇల్లు తిరుగుతా వాటిని పంపిణీ చేశారు. తమ కష్టం తెలుసుకుని, చొరవ తీసుకుని చెప్పులు పంపిచిన పవన్ కళ్యాణ్‌కు గిరిజనలు కృతజ్ఞతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెక్టర్ కోసం మిడ్ నైట్ కార్నివాల్ ప్రారంభించిన JSW MG మోటార్ ఇండియా