Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రఘువీరా రెడ్డికి పవన్ అభినందనలు.. టైమ్ లేక రాలేకపోతున్నానని ట్వీట్.. కేవీపీ బాబును ఏకేశారు..

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అభినందనలు

రఘువీరా రెడ్డికి పవన్ అభినందనలు.. టైమ్ లేక రాలేకపోతున్నానని ట్వీట్.. కేవీపీ బాబును ఏకేశారు..
, ఆదివారం, 4 జూన్ 2017 (13:55 IST)
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అభినందనలు తెలుపుతున్నానని పవన్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి, అన్ని పార్టీలు ఏకంకావాలన్నారు.

అలాగే గుంటూరులో నిర్వహిస్తున్న సభకు హాజరుకావాలంటూ పవన్ కల్యాణ్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. దీనిపై స్పందించిన పవన్... తగినంత సమయం దొరకకపోవడం వల్ల సభకు రాలేకపోతున్నానని తెలిపారు.
 
ప్రత్యేక హోదా కోసం గుంటూరు వేదికగా ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తోంది. అయితే ఈ సభకు వైసీపీ చీఫ్ జగన్, జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్‌తో పాటు వివిద పార్టీల జాతీయనాయకులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కానీ ఈ సభ పట్ల టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పేరుతో సభలు నిర్వహించడాన్ని తీవ్రత ప్పుబట్టింది.
 
కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ప్రత్యేక హోదా కోసం భరోసా పేరుతో నిర్వహించే సభకు వెళ్ళేవారంతా అభివృద్ది నిరోధకులేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. కాంగ్రెస్ సభకు ప్రజలు వెళ్ళకపోవడమే ఆ పార్టీని నిజమైన గుణపాఠమన్నారు. 
 
అయితే టీడీపీ విమర్శలను కేవీపీ తిప్పికొట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రులను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. విభజన చట్టంలోని హమీలు సాధించుకొనే దమ్ము లేకనే కాంగ్రెస్‌పై సీఎం చంద్రబాబునాయుడు నిందలు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపి కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వివిద పార్టీలకు చెందిన జాతీయ నాయకులు మద్దతిస్తున్నా చంద్రబాబు మాత్రం కళ్ళు తెరవడం లేదన్నారు. నాడు రెండు కళ్ళ సిద్దాంతం, నేడు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్రులను సీఎం నిలువునా మోసం చేస్తున్నారని కేవీపి ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ మోసాలకు బ్రేక్-టీనేజర్ల కోసం ఫేస్‌బుక్ నుంచి ''టాక్'' అనే సరికొత్త యాప్