పెద్ద కరెన్సీ నోట్ల రద్దు చాలా మంచి పని : పవన్ కళ్యాణ్ కామెంట్స్
దేశంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ తరహా నోట్ల రద్దు మంచిపని అయినప్పటికీ.. ముందు అవినీతి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయాలనీ, మార్పు అక్కడి నుంచే రా
దేశంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ తరహా నోట్ల రద్దు మంచిపని అయినప్పటికీ.. ముందు అవినీతి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయాలనీ, మార్పు అక్కడి నుంచే రావాలని పిలుపునిచ్చారు.
గురువారం అనంతపురం జిల్లా గుత్తి గేట్స్ కాలేజీ విద్యార్థులతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులోభాగంగా, ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెపుతూ... ‘‘డబ్బులు పంచడం ద్వారా ఓట్లు కొనుక్కునే స్థాయికి మన నాయకులు వెళ్లే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు చాలా మంచి పని. బ్లాక్ మనీని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే, సరికొత్త నోట్లు తీసుకొచ్చే విధానంలో చాలమంది ఇబ్బందులు పడొచ్చు. ట్యాక్స్‌లు కట్టాలంటే మనందరికీ ఇబ్బంది. దానికి కారణం.. మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తే.. గవర్నమెంట్ మన దగ్గర ట్యాక్స్‌లు తీసుకొని, తిరిగి వాటికి తగ్గట్టు మనకు వసతులు కల్పించాలి. ప్రభుత్వం అలాంటి వసతులు కల్పించకపోవడం వల్లే సామాన్యుడు ట్యాక్స్ కట్టడానికి ముందుకు రావడం లేదు. ‘తాను డబ్బు కట్టి ప్రయోజనం ఏమిటి? ఎవరో రాజకీయనాయకులు తినేస్తారు. వాళ్ల జేబుల్లోకి వెళ్లిపోతాయనే’ సామాన్యులు పన్నుల చెల్లించడం లేదన్నారు.