Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాజపా అరిచి గీపెట్టినా వదలని పవన్... 5వ ట్వీట్... ఆర్బీఐ గవర్నరుపై ఫైర్

భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ట్వీట్లపై స్పందిస్తూ... పవన్ ట్వీట్ చేసేముందు కాస్త లోతుగా పరిశీలన చేసుకుని ట్వీట్ చేస్తే మంచిదంటూ వ్యాఖ్యానించింది. ఐతే పవన్ కళ్యాణ్ మాత్రం తన ట్వీట్ల హీట్ తగ్గించడంలేదు. తాజాగా 5వ ట్వీట్ చేశాడు. ఐతే ఈసారి ఆయన ఆర్బీఐ

Advertiesment
pawan kalyan comments
, మంగళవారం, 20 డిశెంబరు 2016 (18:01 IST)
భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ట్వీట్లపై స్పందిస్తూ... పవన్ ట్వీట్ చేసేముందు కాస్త లోతుగా పరిశీలన చేసుకుని ట్వీట్ చేస్తే మంచిదంటూ వ్యాఖ్యానించింది. ఐతే పవన్ కళ్యాణ్ మాత్రం తన ట్వీట్ల హీట్ తగ్గించడంలేదు. తాజాగా 5వ ట్వీట్ చేశాడు. ఐతే ఈసారి ఆయన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పైన మండిపడ్డారు.
 
ట్వీట్లో పవన్ పేర్కొంటూ... మిస్టర్ ఉర్జిత్ పటేల్, డబ్బు కోసం ఏటీఎం క్యూలో నిలబడలేక ఇలా కుర్చీలో కూర్చున్నచోటే ప్రాణాలు వదిలిన శ్రీ బాలరాజును చూడండి. ఇతడే కాదు నోట్ల రద్దు కారణంగా దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు తీసుకున్న నోట్ల రద్దు కారణంగా కోట్ల మంది ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆదివాసీలు, రైతులు, రోజువారి కార్మికులు, గృహిణులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కూరగాయలు-పండ్ల వ్యాపారులు, భవన నిర్మాణ కూలీలు, కాంట్రాక్టు ఉద్యోగులు, చిరు వ్యాపారులు... ఇలా అన్ని రంగాల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
 
కానీ దేశ ద్రోహులు మాత్రం క్యూల్లో నిలబడకుండానే మీరు ముద్రించిన కొత్త నోట్లను పొందేస్తున్నారు. చాలా సౌకర్యవంతంగా వారు కూర్చున్నచోటే ఉండి కొత్త నోట్లు రప్పించుకుంటున్నారు. వారికి సహాయం చేస్తున్నవారు బ్యాంకువారే కావడం దురదృష్టం. మీరేదో నల్లడబ్బును నిర్మూలించేందుకే అంటున్నారు కానీ... ఆ నల్లడబ్బు ఇలా తెల్లడబ్బుగా మారిపోతున్న సంగతి మీకు కనబడటంలేదా? ఈ మార్గం మీరు ఏర్పాటు చేసింది కాదా.? నోట్ల రద్దుతో మీరు వారికి కొత్త మార్గాన్ని చూపారు కదా. మీరనుకున్న నోట్ల రద్దు నల్ల కుబేరులకు పండగ చేస్తుంటే సామాన్య పౌరుడి జీవితాన్ని మాత్రం అస్తవ్యస్తం చేసింది.. అంటూ పవన్ ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధాలపై నిలదీసిన భార్య.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఓవరాక్షన్.. యడ్యూరప్ప హితవు