మాకు కావాల్సింది చెత్త కాదు.. అర్హులైన అనలిస్ట్స్ కావాలి : పవన్ కళ్యాణ్
పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళంలో బుధవారం జనసేన పార్టీ కోసం ఎంపికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చ
పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళంలో బుధవారం జనసేన పార్టీ కోసం ఎంపికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ ఎంపికల్లో యువత ఉత్సహంగా పాల్గొంటున్నారని, పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తామన్నారు. తమకు అందిన అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు.
విజయ నగరం నుంచి జనసేనకు మొత్తం 2 వేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ నెల 20, 21న విజయనగరంలోనూ జనసేన శిబిరం ఉంటుందని తెలిపారు. కాగా, శ్రీకాకుళం, విశాఖపట్నం, గ్రేటర్ హైదరాబాద్ లలో జనసేన శిబిరాల గురించి పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. శ్రీకాకుళంలో ఎంపికలు జరుగుతున్నాయి. దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా ఈ ఎంపికల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఇవి ఎంట్రెన్స్ టెస్ట్‌లాంటివి కావని, యువతలో ప్రతిభను గుర్తించేందుకు మాత్రమే ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
ఉత్సాహం, ఆసక్తి, సామాజిక సృహ ఉన్న యువత కోసం ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉత్తరాంధ్రలో ఆ పార్టీ యువతను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. స్పీకర్స్, అనలిస్ట్స్, కంటెంట్ రైటర్స్‌గా సేవలు అందించడానికి ఉత్తరాంధ్ర నుంచి మొత్తం 6 వేల దరఖాస్తులు రాగా, యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారని జనసేన పార్టీ మీడియా వ్యవహారాల సమన్వయ కర్త హరిప్రసాద్ అన్నారు.