Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిమ్స్‌లో నర్సుపై కోవిడ్ పేషెంట్ బంధువు లైంగిక దాడి.. ఆస్పత్రిలో ఆంబోతుగా..?

రిమ్స్‌లో నర్సుపై కోవిడ్ పేషెంట్ బంధువు లైంగిక దాడి.. ఆస్పత్రిలో ఆంబోతుగా..?
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (21:55 IST)
RIMS Hospital
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా.. అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. తాజాగా కోవిడ్ కేర్ సెంటర్లో కూడా చికిత్స అందిస్తూ సేవ చేస్తున్న నర్సుపై లైంగిక దాడి జరిగింది. 
 
ప్రకాశం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒంగోలు రిమ్స్‌లో అందరూ చూస్తుండగానే నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు కోవిడ్‌ బాధితురాలి బంధువు. వార్డులోనే నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అటు నిందితుడుని అడ్డుకున్న వార్డులోని రోగులు, వారి బంధువులు నర్సును కాపాడారు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి. 
 
బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్న పోలీసులు నిందితుడు విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో వెంటనే కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు ప్రయాణికులు స్మార్టు కార్డులను ఆన్‌లైన్‌లో రీచార్జీ చేసుకొనే వెసులుబాటు