Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్మోహన్‌ నాయుడుకు సంసద్‌ రత్న పురస్కారం

Advertiesment
రామ్మోహన్‌ నాయుడుకు సంసద్‌ రత్న పురస్కారం
, ఆదివారం, 21 మార్చి 2021 (10:07 IST)
టిడిపి ఎంపి కె రామ్మోహన్‌ నాయుడిని సంసద్‌ రత్న పురస్కారం వరించింది. న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి సునీల్‌ అరోరా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎకె పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

చెన్నయ్కి చెందిన ప్రైమ్‌ పాయింట్‌ పౌండేషన్‌ పుష్కరకాలంగా సంసద్‌ రత్న పురస్కారాలు అందజేస్తోంది. ఈ ఏడాది రామ్మోహన్‌తో సహా 10 మందికి ఈ పురస్కారం అందజేసింది.

ఈ అవార్డు అందుకున్న అనంతరం రామ్మోహన్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గతంలో లాగానే ఇక ముందు కూడా ప్రజా సమస్యలను లోక్‌సభలో లేవనెత్తుతానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18 మందిని పెళ్లాడిన యువతి.. ఎక్కడ?