కరోనాతో అందరికీ ఆక్సీజన్ విలువ తెలిసొచ్చింది. భారీగా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఏపీలో ప్రారంభించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో వన మహోత్సవం సందర్భంగా కండ్రికలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మొక్కలు నాటారు.
విజయవాడలో జగనన్న పచ్చ తోరణం కింద వేల మొక్కలను నాటామని, పర్యావరణం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేందుకే ఈ కార్యక్రమమని మంత్రి బొత్స సత్యన్నారాయణ చెప్పారు. మొక్కలను వేసి వదిలేయడమే కాకుండా వాటి ని పెంచే బాధ్యత ఉండాలని, విజయవాడ నగరాన్ని సుందరమైనదిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, మొక్కలను విరివిగా నాటి పెంచి పోషించాలని, కరోనాతో ఆక్సిజన్ విలువ తెలిసిందని చెప్పారు. మొక్కలు పెంచడం ద్వారా ఆక్సిజన్ కొరతను అదిగమించవచ్చని, రాబోయే రోజుల్లో ఇంటింటికి మొక్క నాటే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
విజయవాడ నగరంలోని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. నగరాభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.