Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబును జగన్ తక్కువగా అంచనా వేశాడా? అతి విశ్వాసమే కొంప ముంచిందా...

కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఊహించింది ఒకటైతే, జరిగింది మరొకటి. జిల్లా మొత్తంలో తమ గుర్తుపై గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధుల బలం తమకే ఉంటుందని జగన్ గట్టిగా నమ్మారు. వారు ఏ శిబిరంలో వున్నా తమకే ఓటు వేస్తారని ఎక్కువగా విశ్వసించా

చంద్రబాబును జగన్ తక్కువగా అంచనా వేశాడా? అతి విశ్వాసమే కొంప ముంచిందా...
హైదరాబాద్ , మంగళవారం, 21 మార్చి 2017 (05:51 IST)
కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఊహించింది ఒకటైతే, జరిగింది మరొకటి. జిల్లా మొత్తంలో తమ గుర్తుపై గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధుల బలం తమకే ఉంటుందని జగన్ గట్టిగా నమ్మారు. వారు ఏ శిబిరంలో వున్నా తమకే ఓటు వేస్తారని ఎక్కువగా విశ్వసించారు. ఆ విశ్వాసమే కొంపముంచింది. 
 
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే జయరాములు, కోడూరు ఎమ్మెల్సీ చెంగల్‌రాయుడు టీడీపీలోకి చేరడంతో భారీగా గండిపడింది. అంతకుముందు, ఆ తరువాత కడప జిల్లాపరిషత్‌లో జడ్పీటీసీలు, కడప కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు వైసీపీ నుంచి పదుల సంఖ్యలో టీడీపీతో జతకట్టారు.
 
వీరుకాకుండా సుమారు నాలుగు మండలాల్లో టీడీపీ పావులు కదిపింది. పాలకవర్గాలలోని సభ్యులను తమవైపు లాక్కుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఒక అంచనా ప్రకారం 521 మంది వున్న వైసీపీ స్థానిక ప్రతినిధుల బలం 412కు చేరింది. తర్వాత వైసీపీ బలం సుమారు 398కి చేరింది. 
 
ఎన్నికల నోటిఫికేషన్ రావడంతోనే టీడీపీ నేతలు పావులు కదిపారు. ఎన్నికల నేపథ్యంలో సుమారు 40 మందిని టీడీపీ అధికంగా సేకరించింది. దీంతో 440 దాకా ఎన్నికల ముందే గెలుపు నిర్ణయించే సంఖ్యను చేతిలో పెట్టుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించగా బలం తిరగబడ్డ వైసీపీ ఓటమిపాలు కావాల్సి వచ్చింది.
 
ఓట్లను, అభిమానాన్ని, ప్రజాప్రతినిదుల సంఖ్యను చూసుకుని సంతృప్తి చెందితే ప్రత్యర్థి పక్షం అమాంతంగా అవకాశాలను లాగేసుకుంటుందని ఎన్నిసార్లు టీడీపీ నిరూపించినా ఓటర్లను మేనేజ్ చేయడంలో వెనుకబాటుతనమే జగన్ కొంప ముంచుతోంది. ఓటమికి ఎన్ని సాకులు వెతికినా అసలు లోపం తమలోనే ఉందని వైకాపా గ్రహించనంతవరకు ఇలాంటి ఎదురు దెబ్బలు తప్పవని జనం ఉవాచ.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ వర్గానికి ఎదురు తిరుగుతున్న ఆర్కేనగర్... కార్యకర్తల జంప్‌తో దినకరన్ కలవరం