బాపట్ల తెదేపా ఎమ్మెల్యే వర్మపై విమర్శనాస్త్రాలు సంధించారు బాపట్ల దివ్యాంగుల జనసైనికుడు ఆదిశేషు. ఆయన మాట్లాడుతూ... కలెక్టర్ గారి కార్యాలయానికి సమీపంలో వుండే బాపట్ల ఓవర్ బ్రిడ్జిపైన గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ప్రజలకు మేలు చేస్తారని వర్మను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన చేతకానివారిలా వున్నారని విమర్శించారు.
ప్రజల బాగోగులు ఆయనకు పట్టడంలేదని మండిపడ్డారు. అందుకే కనీసం జిల్లా కలెక్టర్ గారైనా ఓవర్ బ్రిడ్జి దుస్థితిని గమనించి చర్యలు తీసుకోవాలని చేతులు ఎత్తి దణ్ణం పెడుతున్నానంటూ ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు... జనసేన కార్యకర్తలకు ఇప్పుడే పిక్చర్ అర్థమవుతుందని పకపకా నవ్వుతున్నారు.