Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి రెజీనాను చూసేందుకు వచ్చాడు.. సజీవదహనమైన అభిమాని... ఎక్కడ?

సినీ నటి రెజీనాను చూసేందుకు వచ్చిన ఓ 20 యేళ్ళ అభిమాని సజీవదహనమయ్యాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు పట్టణ కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Advertiesment
నటి రెజీనాను చూసేందుకు వచ్చాడు.. సజీవదహనమైన అభిమాని... ఎక్కడ?
, ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (09:13 IST)
సినీ నటి రెజీనాను చూసేందుకు వచ్చిన ఓ 20 యేళ్ళ అభిమాని సజీవదహనమయ్యాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు పట్టణ కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు పట్టణంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్డుపై నీరూస్‌ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించే ఏర్పాట్లుచేశారు. ఇందులోభాగంగా ఓ ఫ్లెక్సీలు, బ్యానెర్లు కట్టారు. అయితే, పిడుగురాళ్లకు చెందిన మహేశ్ (20) ఆ దుకాణాన్ని ఏర్పాటుచేసిన భవనానికి యేడాదికాలంగా వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే, శనివారం ఉదయం విధులు లేకపోయినప్పటికీ నటి రెజీనాను చూసేందుకు పిడుగురాళ్ల నుంచి గుంటూరుకు వచ్చాడు. ఆసమయంలో ఫ్లెక్సీ అమర్చిన ఐరన్ ఫ్రేమ్ పైనున్న హైటెన్షన్‌ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుతాఘాతం సంభవించింది. వెంటనే అక్కడున్నవారు కర్రతో ఫ్లెక్సీని పక్కకులాగే ప్రయత్నం చేశారు. అయితే, గాలికి అది తిరిగి హైటెన్షన్‌ తీగలపై పడటంతో మహేశ్‌ శరీరంపై మంటలు చెలరేగి కుప్పకూలిపోయాడు. 
 
మంటల్లో చిక్కుకున్న మహేష్‌ను మంటల నుంచి బయటకులాగేందుకు స్థానికులు చేసిన ప్రయ‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఈ ఘటనలో మరో యువకుడికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న సినీ నటి షాపు ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్‌కు వెనుదిరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌ను కోల్పోవాల్సి వస్తుందన్న చిదంబరం... ఇక పాక్ రెచ్చిపోతుందని మండిపడ్డ వెంకయ్య