Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జులై 14న సీఎం జ‌గ‌న్ పోలవరం ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న‌

Advertiesment
జులై 14న సీఎం జ‌గ‌న్ పోలవరం  ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న‌
, శనివారం, 10 జులై 2021 (19:58 IST)
పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 14 న ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించ‌నున్నారు. దీనికోసం ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామ‌ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్​ కార్తికేయ మిశ్రా తెలిపారు.
 
శనివారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్, పోలవరం సైట్ లలో జిల్లా కలెక్టర్  ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో రూట్ మ్యాప్ పై చర్చించి, క్షేత్రస్థాయిలో పర్యటించి  కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచనలు చేశారు.

ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ,జిల్లా ఎస్పీలతో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర భద్రత ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో  జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తోపాటు  పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు, జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్, జేసి కె.వెంకట రమణ రెడ్డి, పిఓ ఐటీడీఏ.. ఓ. ఆనంద్, ఇరిగేషన్  అధికారులు ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ సి ఈ  సుధాకర్ బాబు, ఎస్ఇ నరసింహ మూర్తి, జంగారెడ్డి గూడెం ఆర్దీవో వైవి.ప్రసన్న లక్ష్మి, మేఘా ఇంజనీరింగ్ జీఎం ముద్దు కృష్ణ, మేనేజర్ మురళి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్నంలో తమ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ఎథర్‌