తెలుగు రాష్ట్రాల పర్యటన కోసం వచ్చినవున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం ఉదంయ యాదాద్రిలో పర్యటించారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మంగళవారం ఉదయం యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
అంతకుముందు హైదరాబాద్ నుంచి యాదాద్రి చేరుకున్న జస్టిస్ రమణకు తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి వచ్చారు. యాదాద్రిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేశారు.
అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. తర్వాత ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను సందర్శిస్తున్నారు. మొదట ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులను సందర్శించారు.