Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఎన్ టీవీ" ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏలూరి రఘుబాబుకు ఉగాది పురస్కారం

ప్రముఖ జర్నలిస్టు ఏలూరి రఘుబాబు ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ పాత్రికేయుడిగా ఏపీ ప్రభుత్వం ఆయనకు ఉగాది పురస్కారాన్ని అందజేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు పురస్కారాన్ని అందజేశార

Advertiesment
, గురువారం, 30 మార్చి 2017 (19:56 IST)
ప్రముఖ జర్నలిస్టు ఏలూరి రఘుబాబు ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ పాత్రికేయుడిగా ఏపీ ప్రభుత్వం ఆయనకు ఉగాది పురస్కారాన్ని అందజేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు పురస్కారాన్ని అందజేశారు. పాత్రికేయునిగా గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న రఘు ఏలూరి 1965 నవంబరు 1న ప్రకాశం జిల్లా నక్కల పాలెంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఎ తెలుగు చేశారు. 
 
1986లో ఈనాడు పాత్రికేయ వృత్తిని ప్రారంభించిన రఘుబాబు పత్రికల్లోని అన్ని విభాగాల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారు. రాసిన వ్యాసాలు అనేకం.... చేసిన ప్రయోగాలు బహుళం. ఎన్నికల ప్రత్యేక అనుబందాల రూపకల్పనలోనూ, 50 ఏళ్ల స్వతంత్ర భారత వెలుగు రేఖల పేజీల్లోనూ, ఫిల్మోత్సవ్ అనుబంధ పేజీల్లోనూ రఘు కృషి నిరుపమానం. ఈనాడు హైదరాబాద్ సిటీ పత్రిక ఇంచార్జిగా ఆయన చేసిన ప్రయోగాలు అనేకం. 
 
ఈటీవీ ప్రతిధ్వని ప్రారంభించిన రోజు నుంచి దాని బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ కార్యక్రమం ద్వారా సృష్టించిన సంచలనం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈటీవీ2లో తెలుగు వెలుగు, మార్గదర్శి, నారి-భేరి, తీర్థయాత్ర, మాయాబజార్ తదితర ఎన్నో కార్యక్రమాలకు ఆధ్యులు.ఆ తర్వాత ఎన్టీవీ గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా పనిచేస్తూ నిర్వహించిన ధార్మిక సమ్మేళనం, కోటి దిపోత్సవం, భక్తి పత్రిక రఘు ఏలూరి ప్రతిభకు గీటురాళ్లు. గతంలోనూ ఆయన అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వధువు డ్యాన్స్ అదిరింది.. భలే అనిపించింది... 60లక్షల మంది వ్యూస్.. (Video)