ఎన్టీఆర్ 21వ వర్థంతి.. టీడీపీ అవినీతిపై పోరాటానికే వైసీపీలో చేరాను : లక్ష్మీ పార్వతి
ఎన్టీఆర్ 21వ వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గల ఎన్టీఆర్ సమాధి వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ సూచించిన మార్గంలో ఆయన ఆశయ సాధనకోస
ఎన్టీఆర్ 21వ వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గల ఎన్టీఆర్ సమాధి వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ సూచించిన మార్గంలో ఆయన ఆశయ సాధనకోసం పోరాటం సాగిస్తున్నాన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతిపై పోరాటం చేయడానికే తాను వైసీపీలో చేరానని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
మరోవైపు ఎన్టీ రామారావు 21 వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కూతురు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి అయిన భువనేశ్వరి, ఆమె కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. కాగా... ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, ఆయన కుమారులు కళ్యాణ్‌రామ్, జూ.ఎన్టీఆర్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు.