Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రిగోల్డ్ బాధితులకు బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు

Advertiesment
అగ్రిగోల్డ్ బాధితులకు బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు
, శుక్రవారం, 21 మే 2021 (20:19 IST)
అగ్రిగోల్డ్ బాధితులకు ఆగష్టులో న్యాయం చేస్తామని పదే పదే సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించుకున్న రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లను విదిలించి చేతులు దులుపుకుందని అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

తను మాటంటే మాటేనని జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకుంటాడని ప్రజల్లో విశ్వాసం ఉందని తనకు తానే నిన్న బడ్జెట్ పై మాట్లాడుతూ పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధితులకు యిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలం చెందారని పేర్కొన్నారు. 2017 మార్చి 23న బాధితుల దీక్ష శిబిరంలో నిమ్మరసం ఇచ్చి ప్రతిపక్ష నేత హోదాలో నేను అధికారంలోకి వచ్చినా వారం రోజుల్లో 1150 కోట్లు ఇచ్చి 13న్నర లక్షల మంది 20 వేల లోపు పేద డిపాజిట్ దారులను ఆదుకుంటామని చేసిన వాగ్దానం ఏమైంది అని నిలదీశారు.

మొదటి బడ్జెట్లో 1150 కోట్లు కేటాయించి 234 కోట్లు పంచడం దగా కాకా మరేమిటని ప్రశ్నించారు. రెండవ బడ్జెట్లో కేటాయించిన 200 కోట్లు ఎందుకు పంచలేదని అన్నారు. మూడవ బడ్జెట్లో 200 కోట్లు కేటాయించి 10 లక్షల మందికి ఎలా న్యాయం చేస్తారని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండగా ఇప్పటికే మూడు సార్లు పూర్తయ్యాయని అన్నారు. ఈ లెక్కన నాలుగు వేల కోట్లు చెల్లించడానికి ఈ ముఖ్యమంత్రికి ఎన్నేళ్ల సమయం పడుతుందని అంతవరకు ఎంత మంది ప్రాణాలు పోతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు.

అసోసియేషన్ రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి  బి.వి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లు కొల్లగొట్టి నేడు బడ్జెట్లో 200 కోట్లు పెట్టి మోసం చేయటం సరైన పద్ధతి కాదు అన్నారు. ఎన్నో ఆశలతో దినగండం నూరేళ్ళు ఆయుష్షుగా బ్రతుకులు ఈడుస్తున్న బాధితులను మోసం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి వైఖరి ఇలాగే కొనసాగిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాల్సిన 4 వేల కోట్లను ఇచ్చి తన మాటను, తన నిజాయితీని నిలబెట్టుకోవాలని అన్నారు. నేడు విజయవాడలో ఈ ప్రకటనను విడుదల చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ పేషెంట్ల వద్దకు సీఎం కేసీఆర్, చికిత్స బాగా చేస్తున్నారా అంటూ ప్రశ్న