ఏపీకి హోదా ఇవ్వరు కానీ ప్రత్యేక ప్యాకేజీ ఖాయం : పురంధేశ్వరి
గత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం చేసిన అడ్డగోలు విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిందనీ కేంద్రమాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇదే అంశంపై ఆమె మాట్ల
గత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం చేసిన అడ్డగోలు విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిందనీ కేంద్రమాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనే పదానికి 14వ ఆర్థిక సంఘంలో అర్థమే లేదన్నారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దు అని 14వ ఆర్థిక సంఘంతో ప్రత్యక్షంగా చెప్పకపోయినా వారి చర్యలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయన్నారు. హోదా ఇవ్వడం కుదరకపోతే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా స్థానం ఉంటుందన్నారు. ఆంద్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.