Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు ... తేల్చేసిన కేంద్రం

andhra pradesh map
, బుధవారం, 22 మార్చి 2023 (07:40 IST)
విభజన చట్టం మేరకు, విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం మరోమారు తేల్చి చెప్పింది. పైగా, ఇది ముగిసిన అధ్యాయం అంటూ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పెద్ద తేడా ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.
 
మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బౌలశౌరిలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం లిఖిక పూర్వక సమాధానమిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. 
 
పైగా, ఆర్థిక లోటు భర్తీకి 14 ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని తెలిపింది. దీంతో ప్రత్యేక రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల మధ్య ఉన్న అంతరం తొలగిపోయిందని చెప్పారు. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ కింద నిధులు కూడా విడుదల చేశామని వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు: రూ.100ల నాణెం విడుదల