Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతిలో మెట్రో పరుగులు లేనట్టేనా? ఏపీకి జైట్లీ రిక్తహస్తం

కేంద్ర అర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా మొండిచేయి చూపారు. ముఖ్యంగా, ఏపీ ప్రభుత్వం చేసిన అనేక డిమాండ్లను ఆయన ఏమాత్రం పట్టిం

అమరావతిలో మెట్రో పరుగులు లేనట్టేనా? ఏపీకి జైట్లీ రిక్తహస్తం
, గురువారం, 1 ఫిబ్రవరి 2018 (15:06 IST)
కేంద్ర అర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా మొండిచేయి చూపారు. ముఖ్యంగా, ఏపీ ప్రభుత్వం చేసిన అనేక డిమాండ్లను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా పరిష్కరించేందుకు కూడా ఏమాత్రం చొరవచూపినట్టు కనిపించలేదు. 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కొత్త రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరుల మధ్య మెట్రో రైల్ నడపాలని కలలు కంటున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం సహకరించేలా కనిపించడం లేదు. దీనికి నిదర్శనమే బెంగుళూరు మెట్రోకు రూ.17 వేల కోట్లను కేటాయించిన జైట్లీ.. అమరావతి మెట్రోకు ఒక్క పైసా కూడా నిధులు కేటాయించక పోవడం గమనార్హం.
 
అలాగే, ఏపీ ప్రజల ప్రధాన డిమాండ్లలో ఒకటైన విశాఖ రైల్వే జోన్ ఊసెత్తలేదు. ఇది ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, పలు విద్యాలయాలకు నిధులు కేటాయించి కొంత ఊరటనిచ్చారు. 
 
ఏపీ కేటాయింపులు ఇవే:
ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు
ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు
ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు
ఏపీలో ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు
ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు
ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5కోట్లు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు
డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ 2018 : మొబైల్ ఫోన్లు - టీవీ ధరలకు రెక్కలు