Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు అదనపు ఫీజు వద్దు

హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు అదనపు ఫీజు వద్దు
, గురువారం, 28 నవంబరు 2019 (07:59 IST)
కొత్త వాహనాలు కొనుగోలు సమయంలో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు అదనంగా ఎటువంటి రుసుము చెల్లించనవసరంలేదని, వాహన ధరలొనే కలిపి ఉంటుందని డిటీసీ ఎస్ వేంకటేశ్వరరావు తెలిపారు. 
 
స్థానిక డిటీసీ కార్యాలయంలో కృష్ణాజిల్లాలోని వాహన డీలర్లతో సమావేశంను డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు నిర్వహించారు. కొత్త వాహనాలకు కొనుగోలు సమయంలోనే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను వాహన యజమానులకు మ్యానుఫ్యాక్చరర్ లేదా వాహనడీలర్ ద్వారా ఇప్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
 
 డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ- ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను వాహన యజమానులకు ఇచ్చే దానిలో ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా చూడాలని, వాహన డీలర్లకు ఆదేశాలను జారీచేశారు. 
 
కొత్త నిబంధనలు:
* కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ 
నెంబర్ ప్లేట్లును సరఫరా చేసే బాధ్యత మ్యానుఫ్యాక్చర్ / వాహనడీలర్ వహించాలి.
* ఈ నెంబర్ ప్లేట్ల కోసం ప్రత్యేకించి ఎలాంటి ధరను వసూలు చేయరాదు. నంబర్ ప్లేట్ల ధర కూడా వాహనం ధరలోనే కలిగి ఉంటుంది.
* ఏ రోజు ఎన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్లను బిగిస్తున్నది దాని వివరాలతో కూడిన ఒక రిజిస్టర్ను మెయింటినెన్స్ చేయాలి.
* నెంబర్ ప్లేట్లు తయారు చేసే సంస్థలో సెంటర్ మోటార్ వెహికల్ రూల్స్ 126 ప్రకారం ఏదో ఒక టెస్టింగ్ సంస్థ ద్వారా ఆదరైజ్డ్ కలిగి ఉండాలి.
 
 
ఆ టెస్టింగ్ సంస్థల వివరాలు
1. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పూణే.
2. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీ.
3. వెహికల్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, హమీద్ నగర్.
4. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ,మనిసర్.
5. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ , పూణే.
6. గ్లోబల్ ఆటోమోటివ్ రీసెర్చ్ సెంటర్, చెన్నై ద్వారా ఆదరైజ్డ్ చేయబడి ఉండాలి.
 
 
* వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల తయారీ సెంటర్ మోటార్ వెహికల్ రూల్ 50 ప్రకారం లక్షణములు కలిగి ఉండాలి.
* వాహనములకు బిగించిన నంబర్ ప్లేట్ ఏదైనా తొందరగా పాడైనట్లయితే మరల పాత నంబర్ ప్లేట్లను తీసుకొని దాని స్థానంలో కొత్త నంబర్ ప్లేట్లను బిగించాలి.
* 20mm 20mm సైజు కలిగిన క్రోమియంతో తయారుచేయబడిన హోలో గ్రామ్ హాట్ స్టాంపింగ్ ద్వారా ఎడమ మూలన అతికించాలి.
* హోలో గ్రామ్ లో  బ్లూ కలర్ లో చక్రం కలిగి ఉండాలి.
* నెంబర్ ప్లేట్లకు సంబంధించిన మొత్తం వివరాలను రికార్డ్ రూపంలో ఎప్పటికప్పుడు భద్రపరచాలి.
* నెంబర్ ప్లేట్లు తయారుచేసే సంస్థకు టైప్ అప్రూవల్ సర్టిఫికెట్స్ ఎప్పటికప్పుడు రెన్యువల్ అవుతున్నది లేనిది సరి చూసుకోవాలి.

పై నిబంధనల ప్రకారం వాహనదారులకు సేవలను అందించాలని డిటిసి తెలిపారు. సమావేశమునకు హాజరైన వాహన డీలర్లు ఈ విషయాలను మీ వద్ద ఉన్న సిబ్బందికి, సబ్ డీలర్లకు తెలియజేయాలని డిటీసీ కోరారు. ఈ సమావేశంలో ఆర్టీవో  జగదీశ్వరరాజు, ఉద్యోగులు యం రాజుబాబు, జి వి నాగమురళి మరియు వాహన డీలర్ లు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వామి శరణమంటూ పరుగులు పెట్టిన తృప్తి దేశాయ్.. చుక్కలు చూపించారుగా..