Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని తెగనమ్మేశారు?

నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందనీ ఆ పసికందును కూడా ఏమాత్రం కనికరం లేకుండా తెగనమ్మేశారో తల్లిదండ్రులు. అదీ కూడా కేవలం పది వేల రూపాయలకు మాత్రమే.

నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని తెగనమ్మేశారు?
, గురువారం, 27 అక్టోబరు 2016 (16:17 IST)
నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందనీ ఆ పసికందును కూడా ఏమాత్రం కనికరం లేకుండా తెగనమ్మేశారో తల్లిదండ్రులు. అదీ కూడా కేవలం పది వేల రూపాయలకు మాత్రమే. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
స్థానిక జంగాల కాలనీకి చెందిన కళ్లెం సైదులు, భాగ్యమ్మ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడ సంతానం ఉన్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం మరో ఆడశిశువుకు భాగ్యమ్మ జన్మనిచ్చింది. దీంతో, ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలున్నారు, నాల్గో ఆడపిల్లను పోషించలేమని భావించిన ఆ దంపతులు, పాములపాడుకు చెందిన వారికి రూ.10 వేలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్నఐసీడీఎస్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో రబ్బర్ కోడిగుడ్లు.. చైనా చేతివాటం.. ఉడకబెట్టామో.. బాల్‌ అయిపోద్ది..