Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగనన్న హీరో- నారా లోకేష్ కామెడీ యాక్టర్.. లోకేష్‌ను పప్పు అంటే తప్పేంటి?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకే‌ష్‌పై విపక్షనేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున వర్ధంతి శుభాకాంక్షలు అంటూ ఎప్పుడన్నారో నారా లోకేష్ బుక్క

Advertiesment
జగనన్న హీరో- నారా లోకేష్ కామెడీ యాక్టర్.. లోకేష్‌ను పప్పు అంటే తప్పేంటి?
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (17:34 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకే‌ష్‌పై విపక్షనేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున వర్ధంతి శుభాకాంక్షలు అంటూ ఎప్పుడన్నారో నారా లోకేష్ బుక్కైపోయారు. తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, వైకాపా నేత అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్‌పై సెటైర్లు విసిరారు. తమ నాయకుడు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి నారో లోకేష్‌కు హీరోకు-కామెడీ యాక్టర్‌కు ఉన్నంత తేడా ఉందన్నారు. 
 
జగనన్న సీఎం కావాలన్నదే తన మొట్టమొదటి మొక్కు అని అనిల్ చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే వారే అసలైన సైనికులన్నారు. గత ఎన్నికల్లోనే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సి ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిలాగా మెరుగైన పాలనను జగన్ అందిస్తారని చెప్పుకొచ్చారు.  
 
మరోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ కూడా ఏపీ మంత్రి నారాలోకేష్‌పై విమర్శలు గుప్పించారు. సోషల్‌ మీడియాలో లోకేష్‌ను పప్పు అంటే తప్పేంటి? అని ఉండవల్లి ప్రశ్నించారు. సోషల్‌ మీడియా పోస్టింగ్‌లపై అతిగా స్పందిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికే నష్టమని ఉండవల్లి హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పనిలో పనిగా వైసీపీ అధినేత జగన్‌ అవినీతిపరుడని ఉండవల్లి  విమర్శించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఓట్లు పడవన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేటా వార్‌కు తెరపడేలా లేదు.. జియో ప్లాన్స్ 12-18 నెలల కొనసాగింపు?