Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీ కార్యకర్తల ఇళ్ళకి ఎమ్మెల్యే కోటంరెడ్డి బాట!

Advertiesment
nellore rural mla
విజ‌య‌వాడ‌ , గురువారం, 9 డిశెంబరు 2021 (19:27 IST)
రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు, స‌మ‌స్య‌ల చెంత‌కు పాద యాత్ర చేస్తారు. కానీ, ఈ వైసీపీ ఎమ్మెల్యే వినూత్నంగా త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల చెంత‌కు పాద యాత్ర ప్రారంభించారు. 
 
 
జగనన్న మాట - కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం నెల్లూరులోని 27వ డివిజన్లో నిర్వ‌హిస్తున్నారు. శేఖర్ రెడ్డి అనే కార్యకర్త ఇంటి నుండి మొదలైన జగనన్న మాట - కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్, సావిత్రి నగర్, 3, 4 వీధులు, చంద్రమౌళి నగర్, 3, 4 , 5, 6, 7, 8, 9 వీధులు ప్రతి కార్యకర్త ఇంటికి సాగింది. ప్రతీ నాయకునితో వారి ఇంటిలోనే ఏకాంతంగా మాట్లాడుతూ కుశ‌లం అడుగుతున్నారు. 
 
 
ఒక కార్యకర్త ఇంటి నుండి మరో కార్యకర్త ఇంటికి వెళ్లే మార్గమధ్యలో స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ప‌ర్య‌టిస్తున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, సంక్షేమ పథకాల గురించి ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న ఈ ప‌ర్య‌ట‌న వినూత్నంగా ఉంద‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల‌పుడే కాక‌, మామూలు స‌మ‌యంలోనూ కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తించుకునే నాయ‌కులు ఎంద‌రున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమలకు ప్రత్యేక రైళ్లు: డిసెంబర్ 17న ప్రారంభం