Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయీమ్ వెంటే ఓ బండి నిండా అందమైన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా?

గ్యాంగ్‌స్టర్ నయీమ్ దుర్మార్గాల పుట్ట. రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అతని ఇంటి గదిలో లభించిన డైరీలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టార్గెట్ చేసిన వాళ్ళకు ముందుగా అందమైన అమ్మాయిలను

Advertiesment
Nayeem Wanted to Play ‘Naya’ Dawood Ibrahim’ From Saudi Arabia
, గురువారం, 11 ఆగస్టు 2016 (11:08 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ దుర్మార్గాల పుట్ట. రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అతని ఇంటి గదిలో లభించిన డైరీలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టార్గెట్ చేసిన వాళ్ళకు ముందుగా అందమైన అమ్మాయిలను ఎరగా వేసి.. వారు ట్రాప్‌లో పడేట్లు చేయడంతో నయీమ్ సిద్ధహస్తుడని తెలుస్తోంది.

ఈ పని కోసం తాను ఎంపిక చేసుకున్న వారిని వినియోగించుకునేవాడని.. సెటిల్‌మెంట్లు జరిపేందుకు వెళ్లాల్సి వస్తే, తనతో పాటు మహిళలను, అమ్మాయిలను వాహనంలో వెంటబెట్టుకుని వెళ్తాడని.. అలా చేస్తే పోలీసులు అనుమానించరని నయీమ్ ఆ పని చేసేవాడట. 
 
అలాగే సోదాలు చేయాలనుకున్నా.. ఆడవాళ్లుండటంతో పైపైనే పోలీసులు చూసి పంపేస్తుంటారని.. అందుకే నయీమ్ ఓ బండి నిండా ఆడోళ్ళని తన వెంట పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇందుకోసం.. అందంగా ఉండి చిన్న వయసులో భర్తను కోల్పోయిన వారు.. అనాధలైన వారికి ఆశ్రయం పేరిట లోబరచుకుని వారిని వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నయీమ్ హత్య తరువాత అరెస్టయిన ఇద్దరు అమ్మాయిలు కూడా వంటవారు కాదని, అల్కాపురి ఇంట్లో ఎన్నడూ వంట చేసిన దాఖలాలు లేవని పోలీసులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లాస్‌మేట్ అయిన వివాహితపై మనసుపడిన యువకుడు.. కాదన్నందుకు కిడ్నాప్‌కు యత్నం