Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయీమ్ ఎన్‌కౌంటర్‌‌పై కేసీఆర్ మాట.. మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.143 కోట్లు

నయీమ్ ఎన్‌కౌంటర్‌పై సోమవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. రెండున్నర దశాబ్దాలుగా నయీం ముఠా ఎన్నో అరాచకాలకు పాల్పడిందని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలు

Advertiesment
Nayeem got about 4000 crores of assets
, సోమవారం, 19 డిశెంబరు 2016 (14:30 IST)
నయీమ్ ఎన్‌కౌంటర్‌పై సోమవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. రెండున్నర దశాబ్దాలుగా నయీం ముఠా ఎన్నో అరాచకాలకు పాల్పడిందని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.143 కోట్లని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నయీం కదలికలపై నిఘా ఉంచామని తెలిపారు. 
 
గత ఆగస్టు 8న నయీం ముఠా మిలీనియం టౌన్ షిప్ లో మారణాయుధాలతో తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అతని అరెస్టుకు ప్రయత్నించగా ఆ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో నయీం హతమయ్యాడని వివరించారు. నయీం దందాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.. అతని అరాచకాలపై 174 కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులో 741 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు 124 మంది నిందితులు అరెస్టు అయ్యారని కేసీఆర్ వెల్లడించారు. నయీం కబ్జాలో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూమిని, అతనికి చెందిన 37 ఇళ్ళను స్వాధీనం చేసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్ల కుబేరుల గుండెల్లో గుబులు డిపాజిట్‌లపై పరిమితి.. రూ.5వేలకు పైబడితే?