Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయీమ్‌ కేసు: భూ దందాల వ్యవహారంలో పోలీసు అధికారుల పేర్లు.. అంత్యక్రియల్లో నల్లని వస్త్రాల్లో..

గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ కేసులో భూ దందాల వ్యవహారం బయటికొచ్చింది. భూ స్కామ్‌లో కొంతమంది పోలీసు అధికారుల పేర్లు బయటికి వచ్చాయని ఓ పత్రిక వెల్లడించింది. మస్తాన్ అలీ, గండికోట వెంకటయ్య, బూర రాజ గోపాల్, మద్దిపా

Advertiesment
nayeem case land scam
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:00 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ కేసులో భూ దందాల వ్యవహారం బయటికొచ్చింది. భూ స్కామ్‌లో కొంతమంది పోలీసు అధికారుల పేర్లు బయటికి వచ్చాయని ఓ పత్రిక వెల్లడించింది. మస్తాన్ అలీ, గండికోట వెంకటయ్య, బూర రాజ గోపాల్, మద్దిపాటి శ్రీనివాస్.. ఇలా కొంతమంది పేర్లు వెల్లడయ్యాయి. 
 
తన బావమరది బూర రాజగోపాల్ ఖమ్మం జిల్లాలో 2008లో ఎస్ఐ‌గా పని చేస్తుండగా తన పేరిట ఎకరం భూమిని భువనగిరి సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేయించాడని మామిడి నరసింహస్వామి అనే వ్యక్తి సిట్ అధికారులకు తెలిపాడు. 
 
2004 నుంచి రాజగోపాల్ పోలీసు శాఖలో పనిచేస్తున్నాడని, వెంకటరెడ్డి అనే వ్యక్తి తనకు ఎకరం భూమిని ఇస్తానని చెప్పాడని, ఆ తర్వాత ఆ భూమిని తన (నరసింహస్వామి) పేరిట బదలాయిస్తానని హామీ ఇచ్చాడన్నారు. నయీమ్ ఏజెంట్లలో ఒకరు ఆస్ట్రేలియా పరారయ్యాడని సిట్ దర్యాప్తులో తేలింది.
 
కాగా అనుమానం, విభేదాలు, అసహనం.. కారణమేదైనా నయీమ్ సమాధానం మాత్రం హత్యే. సొంత బావతోపాటు అనేక మంది పసి పిల్లలు, పని పిల్లల్ని తన ఇంట్లోనే కుటుంబీకులతో కలసి దారుణంగా చంపేవాడు. హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను స్వయంగా తీసుకువెళ్లే నయీమ్.. నిర్మానుష్య ప్రాంతాల్లో కాల్చేయడమో, శివార్లలో పూడ్చేయడమో చేసేవాడు.
 
అంత్యక్రియల కోసం మృతదేహాలను రవాణా చేసే సమయంలో మాత్రం తన వెంట ‘గడాఫీ సైన్యాన్ని’ తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో వారు కచ్చితంగా నల్లరంగు వస్త్రాల్లో ఉండాలని స్పష్టం చేసేవాడు. అక్క సలీమా బేగం రెండో భర్త నదీం, పని పిల్ల నస్రీన్‌లను అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంట్లో చంపిన నయీమ్.. నల్లవస్త్రాల్లో ఉన్న మహిళా అనుచరులతో వెళ్లి మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించాడని వెలుగులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోర్టార్లతో భారత సైనిక స్థావరాలపై దాడి... పాక్ మరోమారు కాల్పుల ఉల్లంఘన