అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతిచ్చింది. అమరావతి నిర్మాణాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను ఎన్జీటీ తోసిపుచ్చింది.

శుక్రవారం, 17 నవంబరు 2017 (12:35 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతిచ్చింది. అమరావతి నిర్మాణాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను ఎన్జీటీ తోసిపుచ్చింది. అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగైదు పిటిషన్లపై విచారించిన ఎన్జీటీ శుక్రవారం తుదితీర్పు వెలువరించింది. 
 
అమరావతిలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారన్న పిటిషనర్ల అభ్యంతరాలను ఎన్జీటీ తోసిపుచ్చింది. అయితే, పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను ఖచ్చితంగా అమలుచేస్తూనే నిర్మాణాలు సాగాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది.
 
అయితే, కొండవీటి వాగు దిశ మార్చినా ప్రవాహానికి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణా నది ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. 
 
అమరావతిలో నిర్మాణాలను పర్యవేక్షించించేందుకు రెండు కమిటీలను నియమించింది. ఈ కమిటీలు అమరావతిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్జీటీకి చేరవేస్తుంటాయి. పైగా, ఈ రెండు కమిటీలు నెలకు ఒక్కసారి విధిగా సమావేశం కావాలని సూచన చేసింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భర్త డబ్బులు చెల్లించలేదనీ భార్య పైటకొంగుబట్టి లాగిన వ్యాపారి!