Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరేంద్ర మోడీ దేవుడే.. ఇందులో సందేహాలెందుకు? : వెంకయ్య నాయుడి ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల తనకున్న భక్తిప్రపత్తులను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మరోమారు చాటుకున్నారు. ముమ్మాటికీ నరేంద్ర మోడీ దేవుడేనని పునరుద్ఘాటించారు.

నరేంద్ర మోడీ దేవుడే.. ఇందులో సందేహాలెందుకు? : వెంకయ్య నాయుడి ప్రశ్న
, ఆదివారం, 26 జూన్ 2016 (11:42 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల తనకున్న భక్తిప్రపత్తులను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మరోమారు చాటుకున్నారు. ముమ్మాటికీ నరేంద్ర మోడీ దేవుడేనని పునరుద్ఘాటించారు. రాజ్యసభకు వరుసగా నాలుగో సారి ఎంపికైన తొలి భారతీయ జనతా పార్టీ నేతగా రికార్డులకెక్కిన వెంకయ్య నాయుడు శనివారం తన సొంత జిల్లా నెల్లూరుకు తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నెల్లూరు నేతలు ఘన స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని దేవుడు అంటే కొందరు తప్పుబడుతున్నారు. దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మోడీని దేవుడంటే సందేహాలెందుకు? అని వ్యాఖ్యానించారు. తమ కోర్కెలు, కష్టాలు తీర్చాలని ప్రజలు ఆలయాలకు వెళ్లి దేవుళ్లను మొక్కుతారనీ, కానీ, మోడీ ప్రజల కష్టాలను తెలుసుకుని అడగకుండానే వాటిని తీర్చుతున్నారని, అందువల్ల మోడీ దేవుడేనని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పం రైల్వేస్టేషన్‌లో ఘోరం... రైలు ఢీకొని తల్లికూతుళ్ల దుర్మరణం