టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు పేరును ఖరారు చేశారు. "యువగళం" పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. వచ్చే నెల 27వ తేదీ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ పాదయాత్ర సాగుతుంది.
మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలను కవల్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. యువత, మహిళలు, రైతులు సమస్యలను ప్రతిబింభించేలా నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.
ముఖ్యంగా, యువతను ఆకట్టుకునేలా ఈ పాదయాత్ర ప్రణాళికను ఖరారు చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించిన పోస్టరును అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ యాత్రకు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు నారా లోకేష్ సూచనలు చేశారు.