Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాలర్ శేషాద్రి ఆశీర్వాదం.. మంత్రిగా నారా లోకేష్.. మొదట ఏం చేసారో తెలుసా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవలే ఏపీ కేబినెట్‌లో మంత్రిగా చేరారు. ఆయన శుక్రవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకు

Advertiesment
Nara Lokesh
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (12:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవలే ఏపీ కేబినెట్‌లో మంత్రిగా చేరారు. ఆయన శుక్రవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకుడు డాలర్ శేషాద్రి ఆశీర్వదించగా నారా లోకేష్ తన చాంబర్‌లోని కుర్చీలో కూర్చొని మూడు ఫైళ్ళపై సంతకాలు చేశారు. 
 
ఇంతకాలం తెలుగుదేశం పార్టీ కి సంబదించిన అన్ని పనులు దగ్గరనుండి చూసుకున్న నారా లోకేష్, ఇటీవలే మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా నారా లోకేశ్‌ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌ మొదట మూడు దస్త్రాలపై సంతకాలు చేశారు.
 
ఈ ఫైళ్ళలో మూడు మేలు చేసే కార్యాలు ఉన్నాయి. ఈ ఏడాది కనీసం 50 రోజులు పని చేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తిస్తూ తయారు చేసిన ఫైల్‌పై ఆయన తొలి సంతకం పడింది. తద్వారా వచ్చే ప్రయోజనాలను సుమారు 30 లక్షల కుటుంబాలకు అందనున్నాయి. అంటే పెళ్లి చేసుకుంటే రూ.10 వేల నగదుతో పాటు ప్రసూతి ఖర్చుల నిమిత్తం మరో రూ.20 వేలు, ప్రమాద బీమా కింద రూ.5 లక్షల వంటి 11 ప్రయోజనాలు పొందుతారు. 
 
ఆ తర్వాత పంచాయితీరాజ్ ద్వారా అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తయారైన ఫైల్‌పై రెండో సంతకం, అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటు ద్వారా దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో తయారు చేసిన ఫైల్‌పై మూడో సంతకం పెట్టారు. లోకేష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోటీ పడటం గమనార్హం. సంతకాల అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ గ్రామాలు, తండాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రెండేళ్లలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వస్త్ర దుకాణం కుర్రాడితో ప్రేమలో పడిన మహిళా టెక్కీ... వాడుకుని వదిలేశాడు..